తొండముదిరితే ఊసరవెల్లి అవుతుంది, ఇదేం చేస్తుంది దేనిపైకి వెల్లినా అదేరంగులోకి మారిపోతుంది...అంటే మనభాషలో ఏఎండకాగొడుగు అన్నమాట. కాంగ్రేస్ లో ఇపుడిదే పరిస్థితి. జూనియర్లుగా చేరి సీనియర్లు గా మారి సిఎం తో సహా పార్టీని సైతం ఉతికారేస్తున్నారు. పదవులకోసం పాకులాడుతున్నారా అంటే అదీ లేదు, ఇప్పుడున్న పదవులే వారికి ఎక్కువ.ఎందుకంటే వీరిలో ఒకరికి పిసిసి అద్యక్షపదవి ఇస్తే పార్టీని ఉద్దరించాల్సింది పోయి పార్టీవైఖరినే ఎండగడుతూ లేచినప్పటి నుంచి నిదురపోయే వరకు ఆపదవిచ్చిన అధిష్టానాన్ని తిట్టిపోయడంతోనే కాలం గడిపేవారు. తాతలతో సహవాసం చేసిన వారు కావడంతో ఏమి అనలేక ఆపదవిని ఊడగొట్టి పెద్దలసభలో కూర్చోబెట్టి పెద్దమనిషిలా ఉండమంటే కొన్నాళ్లు గమ్మున ఉన్న ఆయన ఈమద్యలో మళ్లీ లేచారు,తిట్లబాగోతం లంకించుకున్నారు.ఇంతకి ఆయన ఎవరనుకుంటున్నారు ఆయనే నోరు తెరిస్తే సినిమాల్లో మోహన్ బాబు డైలాగులా నాన్ స్టాప్ గా అరచినట్లు మాట్లాడే మాజిపిసిసి అధ్యక్షులు ప్రస్థుత రాజ్యసభ సభ్యులు కే.కేశవారావు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రేస్ పార్టీని పాతరేస్తారంటూ, రాష్ట్రంలో కాంగ్రేస్ కు పుట్టగతులుండవని సొంత పార్టీకే శాపనార్థాలు పెడుతున్నారు.ఇది ఆయనకు కొత్తేమి కాదు,పార్టీలోని వారు కూడా ఈయనను పట్టించుకోవడం మానేశారట. కాని చూసేవారికి మాత్రం పదవులతో పాటు రాజకీయజీవితాన్నిచ్చిన పార్టీ మంచిపని చేసినా,చెడ్డపని చేసినా వెనుకేసుకురావాలి కాని శత్రువర్గం కూడా పెట్టనంత శాపనార్థాలు పెట్టడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీలో ఈఒక్క సీనియర్ దే ఈవ్యవహారం అనుకుంటే పొరపాటే ఈయనుకు తోడుగా మరెందరో ఉన్నారు.వారిలో ఇంకొకరు వి.హనుమంతరావు ఈయన కూడా పెద్దలసభలో కూర్చున్న పెద్దమనిషే. అయితే ఈయన నోరు విప్పితే కూడా సొంత పార్టీపై తిట్లపురాణమే కాని కేకే కు కాస్త భిన్నం. కేకే పార్టీతో సహా అందరిని కడిగి పారేస్తుంటే వి.హెచ్.మాత్రం సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టిపోస్తున్నారు. అందరు మెచ్చుకున్నా సరే ఆయన మాత్రం ముఖ్యమంత్రిని అంటే ఒక్క కిరణ్ అని కాదు,అంతకు ముందున్న వైఎస్ ను కూడా విహెచ్ తిట్టి పోసేవారు. బహుశా ఆయనకు ఆపదవి ఇప్పటి వరకు దక్కలేదనో, ఇక దక్కే అవకాశాలు కూడా లేవనో తెలియదు. రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపుల విషయంలో సొంత పార్టీవారే కాకుండా టిడిపితో సహా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు,నాయకులు,చివరకు మేధావులు కూడా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీరును తప్పుబట్టారు,కేంద్రం తీరును విమర్శించారు కాని వి.హన్మంతరావు మాత్రం ఈవిషయంలో సిఎంను దుమ్మెత్తిపోసారు,జైపాల్ రెడ్డిని వెనుకేసుకొచ్చారు. వీరిసరసన పార్టీకి పదేపదే హెచ్చరికలు జారిచేసే మరో వృద్దనేత ఎంపి వివేక్ తండ్రి వెంకటస్వామి ఉండేవారు, ఆరోగ్యం బాగాలేక ఆయన తెరపైకి రావడం లేదు,ఈయనకు తోడుగా కరీంనగర్ కే చెందిన మరోవృద్దనేత ఎంఎస్ సత్యనారాయణ ఉండేవారు. ఇలా ముదిరిన నేతలంతా పార్టికి ముదురుపనులే చేసారు,చేస్తున్నారు. వీరి గోల నుంచి పార్టీ ఎప్పుడు బయటబడుతుందో ఏమిటో.
మరింత సమాచారం తెలుసుకోండి: